Share News

Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

ABN , Publish Date - Nov 26 , 2024 | 10:55 AM

రాష్ట్రంలో వైరల్‌ జ్వరాలు(Viral fevers) విజృంభిస్తున్నాయి. దీంతో ఏ ఆస్పత్రిలో చూసినా బాధితులతో కిటకిటలాడుతోంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లోనూ వైరల్‌ ఫీవర్‌ కేసులు అధికంగా ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరించారు. ఈ వైరల్‌ ఫీవర్‌ బాధితులు వైద్య చికిత్స తర్వాత మూడు రోజుల్లోనే కోలుకునే అవకాశమున్నా ఈ జ్వరంతో పాటు దగ్గు, వంటి నొప్పులు కూడా తోడవుతుండటంతో కోలుకోవడానికి వారం రోజులు పడుతోందని వైద్యులు చెబుతున్నారు.

Viral fevers: విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు

- గర్భిణులు, వృద్ధులకు మాస్కులు తప్పనిసరి

- వైద్యనిపుణుల హెచ్చరిక

చెన్నై: రాష్ట్రంలో వైరల్‌ జ్వరాలు(Viral fevers) విజృంభిస్తున్నాయి. దీంతో ఏ ఆస్పత్రిలో చూసినా బాధితులతో కిటకిటలాడుతోంది. రాజధాని నగరం చెన్నై(Chennai)లోనూ వైరల్‌ ఫీవర్‌ కేసులు అధికంగా ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరించారు. ఈ వైరల్‌ ఫీవర్‌ బాధితులు వైద్య చికిత్స తర్వాత మూడు రోజుల్లోనే కోలుకునే అవకాశమున్నా ఈ జ్వరంతో పాటు దగ్గు, వంటి నొప్పులు కూడా తోడవుతుండటంతో కోలుకోవడానికి వారం రోజులు పడుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ జ్వరాలు రాకుండా ఉండేందుకు గర్భిణులు, వృద్ధులు తప్పకుండా మాస్కులు ధరించాలని కూడా సూచిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: ప్రజలు తిరస్కరించిన గుప్పెడుమంది అరాచకం


ఈ జ్వరాలు రావటానికి ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ప్రధాన కారణమని, కొందరికి ఇన్‌ఫ్లూయెంజా ఏ వైరస్‌, మరికొందరికి ఇన్‌ఫ్లూయెంజా బీ వైరస్‌ కారణమవుతోందన్నారు. కొందరికి ఆడినోవైరస్‌ కారణంగా శ్వాసకోస సమస్యలు ఎదురవుతున్నాయి.

nani1.2.jpg

ప్రస్తుతం రాష్ట్రంలో చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా చలిగాలులు అధికం కావటం వల్ల కూడా జ్వరాలు వ్యాపిస్తున్నాయని వైద్యనిపుణులు తెలిపారు. పాఠశాలల్లో చదివే బాలబాలికలు కూడా ఈ వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారని, వారికి తల్లిదండ్రులు సకాలంలో చికిత్స అందించాలన్నారు. ఈ జ్వరాల బారిన పడకుండా గర్భిణులు, 60 యేళ్లకు పైబడిన వృద్ధులు ముఖాలకు తప్పకుండా మాస్కులు ధరించాలని కూడా విజ్ఞప్తి చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్‌ నుంచి బ్యాగుల్లో పాములు

ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్‌ స్టేడియం

ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2024 | 10:57 AM