Home » Tamilnadu News
వ్యవసాయంలో కొందరు రైతులు నూతన ఒరవడిలు సృష్టిస్తున్నారు. నష్టాల్లో ఉన్న పంటలను లాభదాయకంగా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. తమిళనాడుకి చెందిన ఓ రైతు కొంచం విస్తీర్ణంలో పాలకూర సాగు చేస్తూ వేలల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. విల్లుపురం పనంపట్టు ప్రాంతానికి చెందిన మురుగన్ అనే రైతు కొన్నిరోజులుగా పాలకూర పండిస్తున్నాడు.
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
తమిళనాడులోని (Tamilnadu) రెండు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. పాఠశాలల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. కోయంబత్తూర్‌లోని (Coimbatore) పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్ (PSBB Millennium School), కాంచీపురం జిల్లాలోని (Kancheepuram District) ఓ ప్రైవేట్ పాఠశాలకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
కుప్పం, తమిళనాడు సరిహద్దుల్లోని పాలార్ ప్రాజెక్ట్ వివాదం (Palar Project Controversy) మళ్లీ తెరమీదకి వచ్చింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) చేసిన ప్రకటన కారణంగా.. ఈ వివాదం మరోసారి అగ్గిరాజుకుంది. ఇటీవల కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో భాగంగా.. 0.6 టీఎంసీల కెపాసిటీతో రూ.215 కోట్ల వ్యయంతో చిన్నపాటి రిజర్వాయర్‌ను (Reservoir) పాలార్ ప్రాజెక్ట్‌పై నిర్మిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
తమిళనాడులో (Tamilnadu) ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. వేరే కులానికి చెందినవాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. అమ్మాయి తరఫు బంధువులు ఆమె భర్తను అతి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో బాధితురాలి బావతో పాటు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడ్ని మెకానిక్‌గా పని చేస్తున్న ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చెన్నై (Chennai) నగరానికి సమీపంలోని పల్లికరణై ప్రాంతంలో శనివారం చోటు చేసుకుంది.
మన భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ‘డ్రగ్ రాకెట్’ (Drug Racket) ఒకటి. దీనిని నిర్మూలించేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇల్లీగల్‌గా ఈ దందా నడుస్తూనే ఉంది. ఈమధ్య కాలంలో ఇది మరింత విస్తరించడంతో.. అధికారులు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహించి, డ్రాగ్ రాకెట్ నెట్‌వర్క్‌లను ఛేధిస్తున్నారు. తాజాగా మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయ్యింది.
పోలీసులు (Police) ఉన్నది సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడం కోసం.. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం.. సమస్యల నుంచి బయటపడేసి వారికి న్యాయం అందించడం కోసం! కానీ.. కొందరు మాత్రం తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయాలకు పాల్పడుతుంటారు. సహాయం కోసం తమ వద్దకు వచ్చిన బాధితులనే వేధింపులకు గురి చేస్తుంటారు. తాజాగా తమిళనాడులోనూ (Tamilnadu) ఓ అధికారి భక్షకుడిగా ప్రవర్తించాడు.
చెన్నైకి చెందిన సిటిజన్ కన్స్యూమర్ అండ్ సివిక్ యాక్షన్ గ్రూప్ (CAG) ఈ పథకం ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు ‘టువర్డ్స్ జెండర్ ఇన్‌క్లూసివ్ ట్రాన్స్పోర్ట్’ పేరుతో ఒక అధ్యయనం నిర్వహించింది. ఈ స్టడీలో భాగంగా.. తమిళనాడులోని చెన్నై (Chennai), కోయంబత్తూర్, సేలం, తిరునెల్వేలి, తిరువణ్ణామలై, తిరువారూరు వంటి నగరాల్లో మొత్తం 3వేల మంది మహిళల్ని CAG ఇంటర్వ్యూ చేసింది.
అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ పార్టీ పేరు ప్రకటించారు తమిళ హీరో విజయ్ దళపతి(Tamil hero Vijay). తన రాజకీయ ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో(EC) పార్టీ పేరు నమోదు చేశారు.
ఓ వైపు అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా మరోవైపు ప్రధాని మోదీ(PM Modi) తమిళనాడు పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఆయన శనివారం రామేశ్వరంలోని జలాల్లో పవిత్ర స్నానం ఆచరించారు.