Share News

Annamalai Steps Down: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:31 AM

తమిళనాడు బీజేపీ అధ్యక్షపదవికి అజిత్ అన్నామలై కొనసాగాలని ఆసక్తి వ్యక్తం చేయలేదు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా ఆయన దీనిపై మరింత వివరణ ఇవ్వనున్నట్లు చెప్పారు

Annamalai Steps Down: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసులో నేను లేను

  • కొత్త అధ్యక్షుని ఎంపిక తర్వాత చాలా మాట్లాడతా: అన్నామలై

చెన్నై, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా మరోసారి కొనసాగాలని తాను కోరుకోవడం లేదని అన్నామలై ప్రకటించారు. ఆ పదవికి నియామకం జరిగిన తర్వాత దీనిపై పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. శుక్రవారం ఉదయం కోయంబత్తూరు విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవికి కొందరి పేర్లను సిఫారసు చేసినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నామలై తెలిపారు. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య రాష్ట్రంలో ఎన్నికల పొత్తు కుదిరే అవకాశాలు ఉండటం వల్లే అధ్యక్ష పదవి నుండి తప్పుకొంటున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎటువంటి రాజకీయ ఊహాగానాలపైనా తాను స్పందించబోనని స్పష్టం చేశారు. తనకు అధిష్ఠానవర్గం నిర్ణయమే శిరోధార్యమన్నారు.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 04:31 AM