Amit Shah: తమిళనాడు సీఎంకు అమిత్ షా కౌంటర్.. 5 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడి
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:01 PM
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర నిధులు అందడం లేదన్న సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. మోదీ ప్రభుత్వం తమిళనాడుకు గత పదేళ్లలో రూ. 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

కేంద్రం నిధుల కేటాయింపు విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తోందన్న తమిళనాడు(tamilnadu) సీఎం ఎంకే స్టాలిన్ (tamilnadu cm stalin) ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈరోజు (ఫిబ్రవరి 26) తోసిపుచ్చారు. అంతేకాదు 2014 నుంచి 2024 వరకు మోదీ ప్రభుత్వం తమిళనాడుకు రూ.5,08,337 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. తమిళనాడు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం, తిరువన్నమలై, రామనాథపురంలో మరో రెండు జిల్లా కార్యాలయాల ఇ-ప్రారంభోత్సవంలో షా మాట్లాడిన క్రమంలో పేర్కొన్నారు.
కేంద్రం చేతిలో తమిళనాడు అన్యాయానికి గురైందని సీఎం ఎప్పుడు అంటుంటారని, కానీ అది నిజం కాదని అమిత్ షా స్పష్టం చేశారు. యూపీఏ, ఎన్‌డీఏ హయాంలో పంపిణీ చేసిన నిధులను పోల్చి చూసుకుంటే అసలు నిజమైన అన్యాయం, ఎవరు చేశారో తెలుస్తుందని షా వెల్లడించారు. 2025 ఏడాది ఢిల్లీలో విజయంతో ప్రారంభమైందని, 2026లో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వంతో ముగుస్తుందని అమిత్ షా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమిళనాడులో డీఎంకే జాతి వ్యతిరేక ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. తమిళనాడులో ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలుకుతుందని, ఇక్కడ బంధుప్రీతి దుకాణం మూసివేస్తామని, అవినీతి శాశ్వతంగా అంతమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు.
అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో కూడా మహిళలకు భద్రత లేదన్నారు. 700 రోజులు గడిచినా, వెంగైవాయల్ కేసులో నిందితులను అరెస్టు చేయలేదన్నారు. డీఎంకే నాయకులందరూ అవినీతి కేసుల్లో మాస్టర్స్ డిగ్రీ చేశారని ఎద్దేవా చేశారు అమిత్ షా. అంతేకాదు డీలిమిటేషన్‌పై స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా లబ్ది పొందేందుకేనన్నారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News