Justice Sundresh: అంకితభావంతో లక్ష్యసాధన
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:06 AM
వీఐటీ యూనివర్సిటీ డే సందర్భంగా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. జస్టిస్ సుందరేశ్ లక్ష్యసాధనకు కష్టపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు

విద్యార్థులకు జస్టిస్ సుందరేశ్ పిలుపు
ఘనంగా వీఐటీ యూనివర్సిటీ డే
వేలూరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): అంకితభావంతో కష్టపడి విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం వేలూరులో జరిగిన వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) యూనివర్సిటీ డేకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సుందరేశ్.. వివిధ క్రీడా, ప్రతిభా పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రూ.1.4 కోట్ల విలువైన బహుమతులను వర్సిటీ అందజేసింది. జస్టిస్ సుందరేశ్ మాట్లాడుతూ.. శిక్షణ, అభిరుచి ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. చైనాకు చెందిన ఝా వెన్‌జాన్ అనే అమ్మాయి చిన్న వయసులోనే చెస్ నేర్చుకుని గొప్ప ఆటగాళ్లందరినీ ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిందని తెలిపారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎన్నో పోరాటాల తర్వాత విజయాన్ని అందుకున్నారన్నారు. ఈ విజయాలకు కారణం వారి కఠోర శ్రమయేనని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ.. విద్య, క్రీడా రంగాల్లో వివిధ విభాగాల్లో అవార్డులు పొందిన 3,200 మంది విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమానికి లార్సన్ అండ్ టూబ్రో కార్పొరేట్ సెంటర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గణేశన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యక్షులు శంకర్ విశ్వనాథన్, శేఖర్ విశ్వనాథన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సంధ్యా పెంటారెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్.విశ్వనాథన్, రమణి బాలసుందరం, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కాంచన భాస్కరన్, ప్రొ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ పార్థసారథి మల్లిక్, రిజిస్ర్టార్ డాక్టర్ టి.జయభారతి విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News