Home » TATA Group
రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కూడా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆకాశమే హద్దుగా విస్తరించారు. అలాగే దాతృత్వంలో తనకు సాటి లేదని నిరూపించారు. మన దేశంలో ప్రతి రోజు ఎన్నో కోట్ల మంది ఏదో ఒక టాటా ఉత్పత్తిని వాడుతూనే ఉంటారు.
టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు.
రతన్ టాటా మృతి కేవలం దేశానికే కాదని ప్రపంచానికి తీరని లోటని కోమటి జయరాం తెలిపారు. విలువలకు, నీతి నిజాయితీకి రతన్ టాటా నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆయనలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. తన ఆదాయంలో సగానికిపైగా సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా..
టాటా సంస్థల సారథిగా రతన్‌టాటా ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొన్నారు.. ఆ సవాళ్లనే అవకాశాలుగా మలిచి కంపెనీ అభివృద్ధికి దారులు పరిచారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర మంత్రిమండలి సంతాపం తెలిపింది. గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ భేటీకి ముందు రతన్ చిత్రపటానికి సీఎం చంద్రబాబు, మంత్రులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రజలు మెచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త.. టాటా గ్రూప్ గౌరవ అధ్యక్షుడు.. రతన్ టాటా అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో, ముంబైలోని వర్లీ దహనవాటికలో జరిగాయి.
రతన్ టాటా సవతి సోదరుడు నోయోల్ టాటా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకు ఈ టాటా గ్రూప్‌లో పని చేసిన అనుభవం ఎంతో ఉంది. ప్రస్తుతం టెండ్ర్ అండ్ టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. నోయోల్ టాటా నాయకత్వంలో ఈ గ్రూప్ అత్యున్నత శిఖరాలు అందుకునే అవకాశముందనే ఓ చర్చ సాగుతుంది.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది.
రతన్ టాటా జంతు ప్రేమికుడనే విషయం మీకు తెలుసా. ఆయనకు చిన్ననాటి నుంచే శునకాలంటే ఎంతో ఇష్టం. రతన్ టాటా మరణించడంతో.. ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే శునకం దీనంగా ఎదురుచూసింది.
దివికేగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత, టాటా సన్స్ సంస్థ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata)కు యావత్ భారతావని నివాళి అర్పించింది. అనంతరం ఆయన అంతిమయాత్ర గురువారం సాయంత్రం ప్రారంభమైంది.