Home » TDP - Janasena
రాజకీయాల్లో రాణించడం అంటే.. అంతా మామూలు విషయం కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ముందుగా జనాల...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గతానికి భిన్నంగా ఈసారి మంత్రివర్గాన్ని చంద్రబాబు నియమించారు.
కేంద్రంలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక ఏపీ వంతు వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈనెల12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో చేరడంతో.. రాష్ట్రప్రభుత్వంలో జనసేన, బీజేపీ భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంపై ఆయా పార్టీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేక్‌లు కట్‌చేసి, బాణాసంచా కాల్చి కూటమి విజయాన్ని వేడుకుగా జరుపుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఘన విజయ పథంలో నడిపిన టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ఇప్పుడు మరోసారి జాతీయ యవనికపై మార్మోగుతోంది. గతంలో 1996లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటు, ప్రధానమంత్రులుగా హెచ్డీ దేవెగౌడ, ఐకే
ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనపై ఓటర్లు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఫలితాలు స్పష్టం చేశాయి. సంక్షేమ పథకాల పేరుతో వందల కోట్ల రూపాయిలు నేరుగా ప్రజల ఖాతాల్లో వేసినా ఓట్లు పడకపోవడం వైసీపీ అధినేత జగన్‌ను ఆశ్చర్యం కలిగించింది.