Share News

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:04 AM

మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్‌ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

  • రాత్రి 7.15 గంటలకు..

  • రాష్ట్రపతిని కలిసిన ఎన్డీయే నేతలు

  • మోదీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ

  • టీడీపీకి 2 కేబినెట్‌, 2 సహాయ మంత్రి పదవులు?

  • జనసేనకు ‘స్వతంత్ర హోదా’ పదవి

న్యూఢిల్లీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్‌ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలన్నీ మోదీని ప్రధానిగా సమర్థిస్తూ వేర్వేరు లేఖలను కూడా రాష్ట్రపతికి అందజేశాయి.

ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థన మేరకు ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి తేదీ సమయాన్ని సూచించారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఢిల్లీని 9, 10 తేదీల్లో నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించారు. రాష్ట్రపతితో భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తన నివాసంలో మిత్రపక్షాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపారు.చంద్రబాబు, నితీశ్‌ కుమార్‌, ఏక్‌నాథ్‌ షిండే, పవన్‌ కల్యాణ్‌, చిరాగ్‌ పశ్వాన్‌, జయంత్‌ చౌదరి, అనుప్రియ పాటిల్‌, అజిత్‌ పవార్‌లు నడ్డాతో చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనతాదళ్‌(యు)లకు రెండు కేబినెట్‌, రెండు సహాయ మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. శివసేన, లోక్‌ జనశక్తిలకు ఒక కేబినెట్‌, ఒక సహాయ మంత్రి పదవి చొప్పున ఇచ్చే అవకాశాలున్నాయి. జనతాదళ్‌(ఎస్‌), జనసేన, ఆర్‌ఎల్‌డీలకు ఒక కేబినెట్‌ కానీ, స్వతంత్ర హోదాలో ఒక సహాయమంత్రి పదవి కానీ కేటాయించవచ్చు. అప్నాదళ్‌లకు ఒక సహాయ మంత్రి కేటాయించే అవకాశాలున్నాయి.

Updated Date - Jun 08 , 2024 | 03:04 AM