Home » TDP - Janasena
కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈసారి పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు...,
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ సిటీలో పర్యటనకు అధికారులు అడ్డంకులు ఏర్పరిచారు. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ షో, సభకు టీడీపీ, జనసేన పార్టీలు దరఖాస్తు చేశాయి. అయితే అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పేర్కొంటూ పవన్ పర్యటనకు అనుమతి నిరాకరించారు.
Andhrapradesh: జగన్‌కు, కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్టే అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. బీసీ, దళిత, క్రైస్తవులు, ముస్లిం లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏడు నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీకి స్పందన అద్భుతంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు వస్తే...
Andhrapradesh: అమరావతిపై సీఎం జగన్ రెడ్డికి సీతకన్ను అని కూటమి నేతలు మండిపడ్డారు. గురువారం కూటమి నేతలు వర్లరామయ్య, మాల్యాద్రి, లంకా దినకర్, యామిని శర్మ, శివశంకర్, అజయ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ... మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ రెడ్డి విధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతే రాజధాని అని కేంద్రం స్పష్టం చేసిందన్నారు.
ఏపీలో ఎన్నికలకు సరిగ్గా ఐదు రోజులు సమయం మాత్రమే ఉంది. గెలుపు మాదేనంటూ ఎన్డీయే కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. వికసిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. మరోవైపు అధికార వైసీపీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతం టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణక్షేత్రంలో ఎన్డీయే కూటమి విజయవకాశాలు ఎలా ఉన్నాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వలన తెలుగుదేశం, జనసేన జోడికి లాభమా.. నష్టమా..
ఏపీలో పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్వేలు రాజకీయ పార్టీల్లో టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఏప్రియల్ 21 నుంచి మే5 మధ్యన నిర్వహించినట్లు పయోనీర్స్ పేరిట ఓ సర్వే చక్కర్లు కొడుతోంది. ఏప్రియల్ నెలలోనూ ఈ సంస్థ పేరిట ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సర్వేతో పోలిస్తే ప్రస్తుతం విడుదల చేసిన సర్వేలో కొన్ని మార్పులు కనిపించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు గెల్చుకుంటుందని ఈ సర్వే పేర్కొంది.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అభ్యర్ధి కోటీశ్వరరావుకు మద్దతుగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం బీజేపీ ఎలాంటి పనికైనా బరితెగిస్తుందని ఆరోపించారు.
Andhrapradesh: నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం అపార్ట్మెంట్ వాసులతో సుజనా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. అలాగే కొండ ప్రాంత ప్రజలతో కలిసి పోయి వారి ఇబ్బందులు స్వయంగా తెలుసుకుంటున్నారు.
ఈనెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఓటు వేయండి. ఈసారి మీకోసం మోదీ గ్యారెంటీ ఉంది. చంద్రబాబు నాయకత్వం ఉంది.
తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఆయన రేపల్లెలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందన్నారు.