Home » TDP - Janasena
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్లోనూ మార్పునకు నాంది పలుకుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టోను ప్రజలు బేరీజు వేసుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో నవరత్నాల పేరుతో అరకొర లబ్ధి చేకూర్చడం మినహా... అభివృద్ధిని పూర్తిస్థాయిలో విస్మరించారనే అన్ని వర్గాల ప్రజలు జగన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో అమలు పరిచిన
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీలో వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆందోళనలో కనిపిస్తున్నారు. నిన్నటి వరకు గెలిచేది నేనేనంటూ చెప్పుకొచ్చిన జగన్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో తాజా పరిస్థితులు చూస్తుంటే మాత్రం వైసీపీకి ఇబ్బందికరంగా ఉండనేది స్పష్టమవుతోంది. రోజురోజుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరుగుతోంది. బీజేపీ, జనసేనకు ఇచ్చిన సీట్లలో ఈజీగా గెలవచ్చని అంచనావేసిన వైసీపీ నేతలకు ప్రస్తుతం చుక్కలు కనిపిస్తున్నాయట.
ఎన్నికల వేళ ఏపీలో చిత్ర, విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు గ్రామాల్లో తిరుగుతున్న సర్వే సంస్థల ప్రతినిధులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారట. ఓటర్ల నాడిని పట్టుకోవడం సర్వే సంస్థలకు పెద్ద సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని.. ఈ ఎన్నికల్లోనే ఓటర్ల నాడి బయటపడటం లేదట.
రాజకీయంలో దౌర్జన్యం చేస్తే సహించేది లేదు... ప్రజల జోలికి వస్తే తాటతీస్తానని గుంతకల్లు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం వైసీపీ అభ్యర్థి వై వెంకటరామరెడ్డిని హెచ్చరించారు. పట్టణంలోని ఎద్దులపల్లిరోడ్డులో ఉన్న ఓ ఫంక్షన హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన భగీరథ ఉప్పర(సగర) ఆత్మీయ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పత్తి హిమబిందు హాజరయ్యారు.
ABN Andhrajyothi: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. విజేతలను నిర్ణయించేది ప్రజలే. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి అధికారం ఇవ్వాలో ఓటు హక్కు ద్వారా ఓటర్లు నిర్ణయించనున్నారు. నాయకుల రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులే కాదు.. ఓట్లు వేసి గెలిపించే మీరు విజేతలు అయ్యే అవకాశం ఆంధ్రజ్యోతి మీకు కల్పిస్తుంది. మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే మీరు లక్షాధికారి కావచ్చు. ఏపీ ప్రజలను విజేతలు చేసేందుకు ఆంధ్రజ్యోతి సరికొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు వస్తుంది.
వైసీపీ మేనిఫెస్టో చూసి క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలో కొత్త స్కీం లేదు, మెరుపులు లేవని పెదవి విరుస్తున్నారు. మేనిఫెస్టోలో ఉన్న హామీలతో కూటమిని ఎలా ఎదుర్కొంటామని ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీ కన్నా కూటమి మేనిఫెస్టో వెయ్యి పాళ్లు నయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓవైపు.. వైసీపీ మరోవైపు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకెళ్తున్నాయి. ఇరు పక్షాలు ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో సంచలన విజయం సాధించగా.. అలాంటి విజయాన్ని సాధించాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ మాత్రం వైనాట్ 175 అంటూనే.. మెజార్టీ సీట్లలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో గెలవడం 2019లో గెలిచినంత ఈజీ కాదనే అభిప్రాయానికి వైసీపీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తలకు గాయం ఘటనను రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చూశారన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవం గ్రహించడంతో వైసీపీ కుట్రలు ఫలించలేదన్నారు. గులక రాయితో ఎవరు కొట్టారో లేదా జగన్ కొట్టించుకున్నారో ప్రజలకే తెలుసన్నారు. విజయనగరంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు
అభివృద్ధికి అవకాశాలున్నా.. పాలకులు నిర్లక్ష్యంతో ఇంకా వెనుకబడి ఉన్న నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. విశాఖపట్టణం నగరపాలక సంస్థ పరిధిలో ఉండే పెందుర్తి వాణిజ్య కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతం. విశాఖపట్టణం (Visakhapatnam)మహానగరానికి సమీపంలో ఉన్నప్పటికి ఈ నియోజకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఈ నియోజకవర్గంలో పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలతో పాటు పెదగంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
Telangana: ఏపీలో బియ్యం మాఫియాపై ఎన్టీఏ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీ దోపిడి... 50 వేల కోట్ల పైమాటే అని ఎన్డీఏ నేతలు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, లంకా దినకర్, శివ శంకర్లు వ్యాఖ్యలు చేశారు. సోమవారం కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి.. ఆయన అనుచరులు పేదల పొట్ట కొట్టారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి, ద్వారంపూడిలతో వ్యవహారం... కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి అయ్యిందన్నారు.