Home » TDP - Janasena
ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లుగా తేలడంతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ హయాంలో.....
‘గంజాయి ఆచూకీ చెప్పి పట్టించిన వారికి ప్రభుత్వం తరఫున రివార్డ్ అందిస్తాం. అందుకు అవసరమైన టోల్ ఫ్రీ నంబరును 10 రోజుల్లో ఏర్పాటు చేసి ప్రకటిస్తాం’ అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.
Andhrapradesh: వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన పలువురు పెద్దలు ఎన్నో అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మంత్రి హోదాలో ఉంటూనే దౌర్జాన్యాలకు, కబ్జాలకు తెరలేపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారు ఎందరో. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి చర్యలకు పాల్పడి ఇప్పుడు వార్తల్లో నిలిచారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినా విద్యార్థులకు అందించే వేరుశనగ చిక్కీ ప్యాకెట్లపై ఇంకా జగన్ నామ స్మరణ చేయడంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయించాలి. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి’ అని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు.
కేంద్రం నుంచి నిధులు రప్పించి, రాష్ట్రంపై ఆర్థికభారం లేకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తా. ఇదివరకటిలా ఏది పడితే అది మాట్లాడలేను. చంద్రబాబు నా నోటికి ప్లాస్టర్ వేసేశారు’ అని చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
ముఖ్యమంత్రిగా జగన్ ముంచేసిన ప్రభుత్వ సంస్థల్లో విద్యుత్ రంగమే ముందు వరసలో ఉంటుంది. అటు వినియోగదారులను బాదేస్తూ, ఇటు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టే స్తూ ఐదేళ్ల పాలనలో ఏపీకి కళా‘కాంతి’ లేకుండా చేశారు.