Home » TDP
జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు జగన్ బాధ ఏమిటో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు..
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాక తొలిసారి కేంద్రం ముందస్తుగా నిధులు విడుదల చేసింది. వచ్చే నెల నుంచి కీలక నిర్మాణ పనులను ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్రానికి రూ.2,424.463 కోట్లు అడ్వాన్సుగా ఇవ్వాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది.
ఎమ్మెల్యే ద గ్గుపాటి ప్రసాద్ చేతుల మీ దుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. నగరంలోని టీడీపీ అర్బన కా ర్యాలయంలో ఆయన గురువారం సభ్యత్వాన్ని రెన్యువల్ చేసు కున్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్, టాటాగ్రూప్స్ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.
మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.
కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్ భారత్, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్ ప్లాన్పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా
గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఉద్యాన పంటలు ఊపిరి లాంటివని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, మండలాలకు చెందిన హార్టికల్చర్ అధికారులు ఎమ్మెల్యేను కలిశారు.
అనంతపురం అర్బన పరిధిలో లక్ష మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక 43వ డివిజన ఐదో రోడ్డులో సాయి బాబా ఆలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.