Home » Teenmaar Mallanna
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి (Rakesh Reddy) అన్నారు. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై రేవంత్ ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలువరించిన నాలుగు స్థానాలు కాకరేపుతున్నాయి. మాకు కావల్సిందంటే.. మాకు కావాల్సిందేనంటూ బడా నేతలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. నేడు తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది.
కాంగ్రెస్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎవరన్న చిక్కుముడి వీడడం లేదు. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తొమ్మిది సార్లు సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసినా కరీంనగర్ అభ్యర్థి విషయం తేలడం లేదు..