Home » Telangana Assembly
నూతనంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణం చేయించారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ బాధ్యతలు నిర్వమించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ సభాపక్ష నేత రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పు జరిగింది. ఉదయం 10.28 నిమిషాలకు ప్రమాణం చేయాలని ముందుగా నిర్ణయించగా దానిని మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మార్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 43 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొత్తం 119 మంది సభ్యుల్లో వీరి వాటా 36.13 శాతం కావడం గమనార్హం. వెలమలు 13 మంది, కమ్మ వర్గం నుంచి నలుగురు, బ్రాహ్మణ, వైశ్యుల నుంచి ఒక్కొక్కరు చొప్పున విజయం సాధించారు.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. కౌంటింగ్ ఆరంభం నుంచే అధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ చివరి వరకు అదే ఊపును కొనసాగించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన అనేక మంది కొత్త అభ్యర్థులు గెలిచారు.
ఆదివారం విడుదలైన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌కు అధికారం అప్పజెప్పిన తెలంగాణ ఓటర్లు కొన్ని నియోజకవర్గాల్లో సంచలన విజయాలు అందించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ఇచ్చామనే పేరు ఉన్నప్పటికీ దాదాపు 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీ తొలి సారి రాష్ట్రంలో పాలనను చేపట్టబోతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఏ స్థానాల్లో ఎవరు గెలుస్తారు..? ఎంత మెజారీటీతో గెలుస్తారన్నదానిపై బెట్టింగ్‌లు నడుస్తున్నాయ్. జిల్లాల వారీగా కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ కాస్తున్నారు.
Telangana Election Result 2023 : తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అగ్రనేతలు సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎందుకిలా చేశారో.. ఎవరికీ అర్థం కాలేదు. తమ సత్తా చూపించుకోవడానికో.. లేదంటే టెండ్ క్రియేట్ చేయడానికో తెలియదు గానీ.. రెండేసి స్థానాల్లో పోటీలో నిలబడ్డారు...