TS Assembly: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. తొలి చర్చపై సర్వత్రా ఆసక్తి
ABN , Publish Date - Dec 16 , 2023 | 09:22 AM
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించనుండగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపర్చనున్నారు. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా.. టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు.
నిన్నటి(శుక్రవారం) ప్రసంగంలో గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి నెలకొంది. గట్టిగా కౌంటర్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిసైడ్ అయిన నేపథ్యంలో చర్చ హాట్ హాట్‌గా జరుగే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఏంటా అనే ఇంట్రెస్ట్ సర్వత్రా నెలకొంది. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమేనని ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఇంకా బిజినెస్ అడ్వైజర్ కమిటీ కాన్స్టిట్యూట్ కానీ పరిస్థితి. బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ కార్యాలయానికి లేఖలు అందని పరిస్థితి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..