Share News

TS Assembly: కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:13 PM

Telangana: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు.

TS Assembly: కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో గత 50 ఏళ్ల పాలనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (MLA KTR) చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) కౌంటర్ ఇచ్చారు. ‘‘55 ఏళ్లు ఏం చేశారని మమ్మల్ని అంటున్నారు. అది బాగాలేదనే తెలంగాణ తెచ్చుకున్నాం. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాము. ఐదు లక్షల కోట్లతో రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చారు. సంపదతో కూడిన తెలంగాణను విధ్వంసం చేశారు’’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే... ‘‘పదేళ్లు విధ్వంసం జరిగింది అంటున్నారు. మరి 50 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడొద్దా. తాగునీరు సాగునీరు విద్యుత్ ఇవ్వలేని అసమర్థులు. మొదటి రోజే ఇంత భయపడితే ఎలా. మూడు నెలలు సమయమిస్తే కచ్చితంగా అట్టర్ ప్లాప్ అవుతుంది. పదవుల కోసం పెదవులు మూసుకున్న చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలది’’ అంటూ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 16 , 2023 | 12:13 PM