Home » Telangana Assembly
తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను ప్రకటించినప్పటి నుంచి టికెట్ రాని అనేక మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీ రెండో జాబితా విడుదలైంది. కేవలం ఒకే ఒక్క పేరుతో రెండో జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటనను విడుదల చేసింది.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సీఈసీ భేటీలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. 60 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా జరిగిన కసరత్తును ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. సీఈసీ ముందు పెట్టారు.
రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'రైతుబంధు' సాయాన్ని ఆపాలంటూ ఈసీకి కాంగ్రెస్ లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయిందని వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...
మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై బీజేపీ కసరత్తు చేపట్టింది. మరికాపట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాల విడుదలకానుంది. అభ్యర్థుల ప్రకటనపై ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామని.. ఏ క్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు జోరు పెంచారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం.. మరోవైపు మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారం షురూ చేశారు. అంతేకాదు.. 97 మంది అభ్యర్థులకు తెలంగాణ భవన్ వేదికగా బీఫామ్లు అందజేశారు...
అవును.. బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన అన్నట్లుగానే పరిస్థితి ఉంది..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. నేతలు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఎక్కడికి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఈసారైనా టికెట్ దక్కుతుందేమో.. అధినేత కనికరిస్తారేమో అని ఎదురుచూసిన నేతలు పార్టీ హైకమాండ్ కనీసం పట్టించుకోకపోవడంతో ఇక చేసేదేమీ లేక పక్కచూపులు చూస్తున్నారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. .