Share News

KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!

ABN , First Publish Date - 2023-10-15T18:21:47+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్‌లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. .

KCR Sabha : ప్రజలారా ఆగం కావొద్దు.. ఆలోచించి ఓట్లేయాలి!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్‌లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమరంలో గులాబీ బాస్ తొలి ప్రసంగం ఇదే. ప్రజా ఆశీర్వద సభలో బాస్.. ప్రసంగం కోసం జనాలు పోటెత్తగా, అభిమానులు, రాష్ట్ర ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. చాలా రోజుల తర్వాత సభలో ఆయన ప్రసంగిస్తుండటంతో.. ఏం మాట్లాడబోతున్నారు..? బీజేపీ, కాంగ్రెస్ గురించి ఏం విమర్శలు చేస్తారు..? ఈ సభావేదికగా ప్రతిపక్షాలను ఏం చాలెంజ్‌లు చేయబోతున్నారు..? ఇలా చాలా విషయాలపై బీఆర్ఎస్ శ్రేణులు అంచనాలు పెట్టుకున్నాయి కానీ.. ఆశించినంతగా కేసీఆర్ ప్రసంగం లేదనే చర్చ మొదలైంది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది.


KCR-Sabha.jpg

ఇంతకీ ఏం మాట్లాడారు..?

హుస్నాబాద్ వేదికగా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ బాబుకు కేసీఆర్.. బీ-ఫామ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించి భారీ మెజారిటీతో 88 సీట్లు గెలిపించుకున్నాం. ఎన్నికలు వస్తాయి పోతాయి, మనం ఆగం కావద్దు.. ఆలోచించి ఓట్లేయాలి. తొమ్మిదేళ్ళ కింద మన తెలంగాణ పరిస్థితి ఎట్ల ఉండేది..? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. ఆలోచించాలి. స్పష్టమైన విధానం, ఆలోచనతో ఓటింగ్ జరగాలి. తెలంగాణ రాకముందు అధ్వాన్నంగా రాష్ట్ర పరిస్తితి ఉండేది. రాష్ట్ర ఏర్పాటు తరువాత బాధ్యత టీఆర్ఎస్‌పై పెట్టారు. రాష్ట్ర బాగు కోసం మూడు, నాలుగు మాసాలు ఎందరో మేధావులతో మేధోమథనం చేసి తెలంగాణాను నంబర్ వన్‌గా చేసుకున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్. తలసరి ఆదాయంలోనూ నంబర్ వన్. కేంద్రం సాయం లేకపోయినా పల్లెల్లో, పట్టణాల్లో, పారిశ్రామిక విధానంలో నంబర్ వన్‌గా నిలిచాం. గౌరవెళ్లిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేసి కేసులేసినా ముందుకు పోతున్నాం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

BRS-Sabha.jpg

చేశాం.. చేస్తాం కూడా!

కొన్ని పార్టీలు ఒక్క ఛాన్స్ అంటున్నాయి.. ఒక్కటేంది (కాంగ్రెస్) పదిసార్లు మీకే ఇచ్చారు. 60, 70 ఏళ్లు మీరే పాలించినా ఇంకా పేదరికం ఉందంటే మనం సిగ్గుతో తలదించుకావాలి. దళితబందు వంటి పథకాలు అప్పుడెందుకు రాలేదు. ఇంత వెనకబాటుకు కారణం ఆ పార్టీలదే. 40 రుపాయలు పెన్షన్‌లు ఇచ్చిండ్రు గతంలో.. ఇప్పుడు 5000 వరకు ఇచ్చేలా పథకం తెచ్చినం. రైతు బందు కావాలని ఎవరు అడగలేదు.. కానీ ఇచ్చినం ఇప్పుడు పెంచుతున్నం. 50 ఏండ్లు పాలించినొల్ల కాలంలో కరెంట్ కష్టాలెట్లుండే. గౌరవెళ్లి పూర్తి చేసే భాధ్యత నాదే.. సీఎం హోదాలో వచ్చి ప్రారంభిస్తాను. వడ్లు రెండు నెలలు కొన్నా తగ్గుతలెవ్. ఆడబిడ్డ కష్టపడొద్దని మిషన్ భగీరథ తెచ్చినం. శనిగరం ప్రాజెక్టు మరమ్మత్తు చేస్తాను. కొత్తకోట జాతర బాగుంటుంది.. ఆలయ అభివృద్ధి చేస్తాం. ముల్కనూర్‌లో కొత్త బస్టాండ్, ఎల్కతుర్తిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చెస్తాం. దేశానికి ఆదర్శంగా నిలిచినం.. ఇకముందు నిలుస్తాంఅని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించేశారు. గులాబీ బాస్ ఏదో మాట్లాడుతారని భావించిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఏదో మిస్సయ్యింది..? బాస్ ఎందుకిలా తయారయ్యారు..? అని ఒకింత ఆలోచనలో పడిన పరిస్థితి.

KCR-Sabha-2.jpg

TS Assembly Polls : చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రసంగం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి..


Updated Date - 2023-10-15T19:00:04+05:30 IST