Home » Telangana Assembly
అసెంబ్లీలో భజన బ్యాచ్ ఎక్కువైపోయిందన్నారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
Telangana Budget 2024-25: తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రాష్ట్ర తలసరి ఆదాయం,
Telangana Budget: మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూలబొకే ఇచ్చి స్వాగతం పలికారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటిమిని చవిచూసింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్య రెండో రోజు సభ మొదలైంది. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు, కరెంటు లేకుండా తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని బీఆర్ఎస్ను విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు గురువారం(రేపు) రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.
రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.
తెలంగాణలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది. కేంద్రబడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరగడంపై జరిగని చర్చలో భాగంగా రేవంత్, కేటీఆర్ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
Telangana: బడ్జెట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మొండిచేయి చూపడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కాంగ్రెస్ , బీజేపీ చెరో 8 సీట్లు గెలిచి తెలంగాణకు 8 పైసలు కూడా తీసుకొని రాలేదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.
Telangana: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు మొదలవగా.. ముందుగా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఈ ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్ నెస్ తనిఖీ, తండాలు గ్రామ పంచాయతీలుగా ఉన్నతీకరణ, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు...