Share News

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే

ABN , Publish Date - Mar 21 , 2025 | 06:15 PM

Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీష్‌రావు ఇవాళ కలిశారు. ఈ భేటీలో సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంపై చర్చించినట్లు హరీష్‌రావు తెలిపారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్‌రావు చెప్పారు.

Harish Rao: రేవంత్‌తో హరీష్‌‌రావు భేటీ .. అసలు విషయమిదే
Harish Rao Meets CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీలో మాజీమంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే పద్మారావు కలిశారు. అలాగే మాజీమంత్రి మల్లారెడ్డి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్‌ను కలిశారు. మెడికల్ కళాశాల సీట్ల పెంపు కోసం సీఎంను కలిసినట్లు మర్రి రాజశేఖరరెడ్డి చెప్పారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై హరీష్‌రావు చర్చించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో హరీష్‌రావు మాట్లాడారు. సీతాఫల్‌మండి జూనియర్, డిగ్రీ కళాశాల విషయంలో పద్మారావుతో కలసి సీఎం రేవంత్‌ను కలిశానని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సీతాఫల్‌మండి కళాశాలకు రూ.32కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. కేసీఆర్ కేటాయించిన పనులను రేవంత్ ప్రభుత్వం అర్థాంతరంగా ఆపేసిందని హరీష్‌రావు చెప్పారు.


డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు..

కాంగ్రెస్, బీజేపీ పార్టీల ‘బడే భాయ్.. చోటే భాయ్ బంధం’ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి బయటపెట్టారని అన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకపోయినా.. తన ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పల్లెతు మాట అనలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి తాము సమాన దూరంగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ ప్రజల పక్షమని తెలిపారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ కంటే.. సభలో బీఆర్ఎస్‌ను ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై తాను మాట్లాడినంత గట్టిగా ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. తాను రేవంత్ బట్టలు విప్పితే.. మహేశ్వరరెడ్డి రేవంత్‌ను కవర్ చేశారని అన్నారు. కాంగ్రెస్ పిలిస్తే పోవటం లేదని డీఎంకే నేతల ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నైవెళ్తున్నారని తెలిపారు.దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై మెదట మాట్లాడిందే బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ పార్టీకి ఓ స్టాండ్ లేదు... క్లారిటీ లేదని హరీష్‌రావు విమర్శించారు.

HARISH-RAO.gif


ఈ వార్తలు కూడా చదవండి

Betting App: ఆ హీరోల వల్లే 80 లక్షలు పోగొట్టుకున్నా.. వారిని శిక్షించాల్సిందే..

Good News: రేషన్ కార్డు దారులకు శుభవార్త..

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 06:27 PM