Home » Telangana Bhavan
మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’కు చేరుకున్నారు. కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని పార్టీ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్‌లో నిర్వహించనున్న సభపై నేతలతో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఈ నెల 10 కరీంనగర్‌లో నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభను కోల్పోతుంది. లోక్ సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటుదాం అనుకుంటే.. ఉన్న ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. మరో ముగ్గురు ఎంపీలు క్యూ లైన్‌లో ఉన్నారు.
CM Revanth Vs KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు..
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. కాలి తుంటి శస్త్ర చికిత్స తర్వాత తొలిసారిగా ఆయన తెలంగాణ భవన్ కు వస్తున్నారు.
తెలంగాణ భవన్(Telangana Bhavan)లో జేబు దొంగలు రెచ్చిపోయారు. ఈ నెల 27న మైనారిటీ విభాగం సమావేశం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరుగుతోంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టానం ఈ మేరకు ఆహ్వానం పంపింది.
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలకు బీఆర్ఎస్ అధిష్టనం ఈ మేరకు ఆహ్వానం పంపింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలు తిరిగి బుదవారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్షా సమావేశం జరగనుంది. ఇప్పటికే పది పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్షలు పూర్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ప్రమాదం జరిగింది. ఎంపీ కే.కేశవ రావు కారు ఓ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లింది. భూపాలపల్లి నియోజకవర్గం చల్పూర్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్లడంతో అతడు గాయపడ్డాడు.
Telangana: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు.