KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..
ABN , Publish Date - Apr 11 , 2024 | 01:24 PM
Telangana: మహాత్మ జ్యోతిరావు పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, మధుసుధనాచారి, బీఆర్‌ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11: మహాత్మ జ్యోతిరావు పూలే (Mahatma Jyoti Rao Phule) ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు అందరికీ ఆచరణీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేటీఆర్, మధుసుధనాచారి, బీఆర్‌ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాలు జ్యోతిబాపూలే వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్నారు. ‘‘మనం ఏ కులం ఏ మతంలో పుట్టాలి అన్న విషయం మన చేతిలో లేదు’’న్నారు. ఉపాధి కల్పన అందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదన్నారు. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తూ బాధ్యతను నిర్వహిస్తామని వెల్లడించారు.
Rains: సమయానికి ముందే వచ్చేస్తున్నాయ్.. భారీ వర్షాలు కురిపించేస్తాయ్..
దమ్మున్న నాయకుడు కేసీఆర్...
దళిత బంధు, బీసీ బంధు పెట్టినప్పుడు సమాజంలో ఇత వర్గాల నుంచి కొంత ఇబ్బంది అవుతుందని హెచ్చరించారన్నారు. రాజకీయంగా రిస్క్ తీసుకొని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో అత్యధికంగా బడుగు బలహీన వర్గాలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే 12 సీట్లలో 50% సీట్లు కేటాయించిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఎన్నికల ముందు బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించాలన్నారు. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారని.. దాన్ని వెంటనే నిలుపుకోవాలని అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ కోరారు.
ఇవి కూడా చదవండి...
Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?
OnePluse: మే 1 నుంచి వన్ ప్లస్ ఉత్పత్తుల అమ్మకం నిలిపివేత..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...