Share News

TS Politics: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన ప్రకటన

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:50 PM

CM Revanth Vs KCR: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు..

TS Politics: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. సంచలన ప్రకటన

తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. నీటి పంపకాల దగ్గర మొదలైన వివాదం.. వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. ఆఖరికి బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై ఒకరు చెప్పులు చూపించుకుంటున్న పరిస్థితి. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR) విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఓ పదం వాడటంతో.. బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకొచ్చి చెలరేగిపోయారు. దీంతో వివాదం ఇంకాస్త ముదిరిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌‌కు (Telangana Bhavan) విచ్చేశారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా.. అసెంబ్లీ ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు, రేవంత్ వ్యాఖ్యలపై.. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇలా అన్ని విషయాలపై ప్రస్తావించారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశం ముగిసింది.


KCR-Telangana-Bhavan.jpg

సంచలన ప్రకటన..

ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల మీద అవగాహన లేదని కేసీఆర్ సమావేశంలో అన్నారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. రైతులకు నష్టం చేసేలా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నాం. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతాం. మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ఉద్యమ కారులదే. ప్రభుత్వం అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్‌లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులకు గొడ్డలి పెట్టులా మారింది. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను అప్పజెప్పి కేంద్రం చేతికి మన జుట్టు అందించింది. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కోవల్సి వస్తుంది. మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు అవగాహన లేక ప్రాజెక్టులను అప్పగించడానికి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూన్నాం. ప్రజా క్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమాదకర ధోరణిని ఎండగడుతాం. కాంగ్రెస్ తీరుతో జరిగే నష్టాన్ని ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. ఈ నెల 13న నల్గొండలో భారీ నిరసన సభ నిర్వహించబోతున్నాం.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం. దానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలి.. సభను సక్సస్ చేయాలి’ అని ముఖ్యనేతలకు కేసీఆర్ వివరిస్తూ సంచలన ప్రకటన చేశారు.

KCR-Meeting.jpg

మొత్తానికి చూస్తే.. కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్ ఇప్పుడు జోరు పెంచారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ‘సారు రంగంలోకి దిగారు.. ఇక కాస్కోండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ వీరాభిమానులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్ కామెంట్స్‌పై కాంగ్రెస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది..? కేసీఆర్ తలపెట్టిన బహిరంగ సభకు ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటుందా..? లేదా..? వేచి చూడాలి.

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 06 , 2024 | 03:51 PM