BRS: అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవే: కేటీఆర్
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:07 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) జయంతి వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ (KTR) అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాల ఆలోచనల మేరకు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు.. విప్లవం అనే మాటను మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కేసిఆర్‌కే సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. బడుగు బలహీన, దళిత గిరిజన వర్గాల కోసం ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా అవన్నీ అంబేద్కర్ ఆలోచన నుంచి వచ్చినవేనని అన్నారు. కొలంబియా యూనివర్సిటీలో ఆయనకు ఇచ్చిన ఘనమైన నివాళి మనమందరం గుర్తు తెచ్చుకోవాలన్నారు. సమాజంలో సమానత్వం రావాలి అంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని, ప్రజలంతా కలిసి అంబేద్కర్ ఆలోచనల కోసం ఆయన ఆశయాల కోసం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.