Share News

BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:42 PM

బీఆర్ఎస్ పార్టీ (అప్పట్లో టీఆర్ఎస్) స్థాపన మొదలు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎదురనేదే లేకుండా పోయింది. ఎన్ని సార్లు పార్టీ పదవులకు రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా.. కొందరు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.

BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) పార్టీ (అప్పట్లో టీఆర్ఎస్) స్థాపన మొదలు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఎదురనేదే లేకుండా పోయింది. ఎన్ని సార్లు పార్టీ పదవులకు రిజైన్ చేసినా కూడా తిరిగి బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ నేతలు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం 39 సీట్లకే బీఆర్ఎస్ పరిమితమైంది. ఈ 39 మంది ఎమ్మెల్యేల్లోనూ ఒకరు మరణించగా.. కొందరు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. ఇక ఎంపీలతో పాటు ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడారు. టికెట్ ఇచ్చినా కూడా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఇక చోటా మోటా నాయకులైతే పెద్ద సంఖ్యలో గట్టు దాటేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితి దారుణం. ఉద్యమ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆ పార్టీ అధినేత కలలో కూడా ఊహించి ఉండరు. దెబ్బకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు జనంలోకి వచ్చేశారు.

BRS: మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో షాక్

ఇదిలా ఉండగా.. అసలు పార్టీకి ఇంత దారుణ పరిస్థితి రావడానికి కారణమేంటని విశ్లేషించుకున్న గులాబీ పార్టీకి తెలంగాణ భవన్ వాస్తే దెబ్బకొట్టిందని తెలిసిందో.. మరో కారణమో కానీ వాస్తు మార్పులకు తెరదీసింది. తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేయాలని గులాబీ బాస్ నిర్ణయించారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో బీఆర్ఎస్ పెద్దలు వాస్తుపై ఫోకస్ పెట్టారని సమాచారం. తెలంగాణ భవన్ ఎంట్రీతో పాటు ఎగ్జిట్ రాకపోకల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు తెలంగాణ భవన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌కు బీఆర్ఎస్ నేతలు వాయువ్య గేటును ఉపయోగిస్తున్నారు. ఇకపై ఈశాన్య గేట్ నుంచి రాకపోకలు సాగించాలని వాస్తు పండితులు సూచించారట. ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేలా గేట్ వద్ద కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు.

KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Updated Date - Apr 04 , 2024 | 02:06 PM