Home » Telangana BJP
అవును.. ఒకే ఒక్క పదవి.. సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్లో (Etela Rajender) ఎనలేని ఉత్సాహాన్ని తెప్పించింది..! ఇన్నిరోజులు పదవి లేదని అసంతృప్తితో నియోజకవర్గానికే పరిమితమైన రాజేందర్ ఇప్పుడు గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (CM KCR) ‘ఈట’లను దింపేందుకు రెడీ అయిపోయారు..!
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను కేంద్ర మంత్రి పదవి వరించేది, లేనిది తేలడానికి మరో వారం పట్టే అవకాశం ఉన్నది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రాజధానిలో లేకపోవడం, ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు తెలంగాణకు రానున్న నేపథ్యం కారణంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ ఆలస్యం కానున్నది.
కేబినెట్ బేటీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారని.. అందుకే కేబినెట్ భేటీకి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. అయితే అనారోగ్య కారణాల వల్లనే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారని అధికారులు అంటున్నారు. కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలో కొనసాగించడంపై సస్పెన్స్ నెలకొంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను (Bandi Sanjay) తొలగించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అధిష్టానం బండి వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది..
బీజేపీని ఈ స్థాయికి తెచ్చిన బండి సంజయ్‌ను పక్కనెట్టి మరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) అగ్రనాయకత్వం ఎందుకు ఈ పదవి కట్టబెట్టింది..? అది కూడా రెండోసారి ఎందుకిచ్చింది..? ఇంత మంది సీనియర్లు, ముఖ్యనేతలు వద్దనుకుని కిషన్‌రెడ్డే ఆ పదవి ఎందుకు..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి..
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
అవును.. గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్న బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కీలక పదవి వరించినట్లే..! బీజేపీలో (BJP) చేరిన తర్వాత తమ అభిమాన నాయకుడికి పదవి రాలేదని.. ఎప్పుడెప్పుడు పదవి వరిస్తుందా..? అని అభిమానులు, అనుచరులు, కార్యకర్తల ఎదురుచూపులు ఫలించాయి.
ఎన్నికల ముందు బీజేపీ (BJP) అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్నట్లుగా.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన ప్రత్యేక కథనాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి..
రాజకీయాల్లో కానీ.. ఏదైనా ఉద్యోగంలో కానీ.. సినీ ఇండస్ట్రీలో కానీ.. ఫామ్‌లో ఉన్నంత వరకే ప్రాధాన్యత. ఆ తరువాత వంగి వంగి సలామ్ కొట్టిన వారే నువ్వెంత అన్నట్టుగా చూస్తారు. ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి. అవసరపడతారు అంటే ఒక లెక్క.. లేదనుకుంటే మరో లెక్క. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పరిస్థితి అలాగే ఉంది.
తెలంగాణ బీజేపీలో (TS BJP) మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించిన ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించింది.! మరోవైపు.. బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్లోకి అగ్రనాయకత్వం తీసుకుంటోంది..