Bandi Sanjay : బండి సంజయ్‌ను చీఫ్ పదవి నుంచి తొలగిస్తారనగానే..

ABN , First Publish Date - 2023-07-04T10:47:14+05:30 IST

రాజకీయాల్లో కానీ.. ఏదైనా ఉద్యోగంలో కానీ.. సినీ ఇండస్ట్రీలో కానీ.. ఫామ్‌లో ఉన్నంత వరకే ప్రాధాన్యత. ఆ తరువాత వంగి వంగి సలామ్ కొట్టిన వారే నువ్వెంత అన్నట్టుగా చూస్తారు. ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి. అవసరపడతారు అంటే ఒక లెక్క.. లేదనుకుంటే మరో లెక్క. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పరిస్థితి అలాగే ఉంది.

Bandi Sanjay : బండి సంజయ్‌ను చీఫ్ పదవి నుంచి తొలగిస్తారనగానే..

హైదరాబాద్ : రాజకీయాల్లో కానీ.. ఏదైనా ఉద్యోగంలో కానీ.. సినీ ఇండస్ట్రీలో కానీ.. ఫామ్‌లో ఉన్నంత వరకే ప్రాధాన్యత. ఆ తరువాత వంగి వంగి సలామ్ కొట్టిన వారే నువ్వెంత అన్నట్టుగా చూస్తారు. ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి. అవసరపడతారు అంటే ఒక లెక్క.. లేదనుకుంటే మరో లెక్క. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ పరిస్థితి అలాగే ఉంది.

బండి సంజయ్‌కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో నిన్న హుటాహుటిన హస్తినకు వెళ్లారు. ఆయనను తెలంగాణ రాష్ట్ర చీఫ్ పదవి నుంచి తొలగిస్తారనే టాక్ ఇప్పుడు బీభత్సంగా నడుస్తోంది. ఆ పదవిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కట్టబెడతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఫ్లెక్సీలు కొన్ని హైదరాబాద్‌లో వెలిశాయి. ఇప్పుడు అవి హాట్ టాపిక్‌గా మారాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏర్పాటు చేస్తోన్న ఫ్లెక్సీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోటోస్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటో చిన్నగా.. కిషన్ రెడ్డి ఫోటో పెద్దగా బీజేపీ నేతలు పెడుతున్నారు. అధ్యక్షుడి మార్పు వార్తల‌ నేపథ్యంలో ఫ్లెక్సీల్లో కిషన్ రెడ్డికి ప్రాధ్యన్యత పెరిగింది. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఫోటోస్ చిన్నవిగా ఏర్పాటు చేయటంపై సొంత పార్టీలోనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Updated Date - 2023-07-04T11:03:37+05:30 IST