Home » Telangana Election2023
ఎన్నికలకు మేనిఫెస్టో (Election Manifesto) అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రావాలన్నా.. ఉన్న అధికారం ఊడిపోవాలన్నా డిసైడ్ చేసేది మేనిఫెస్టోనే.!. అందుకే అధికారం కోసం పార్టీలు కొన్ని నెలలపాటు మేనిఫెస్టో కమిటీలు, అధినేత, అగ్ర నాయకులు కూర్చొని కసరత్తులు చేస్తారు..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారి (Tirumala Lord Venkanna) దర్శానానికి వెళ్తూ.. రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు (Telugu States Politics), వెంకన్న ఆదాయం (Venkanna Hundi) గురించి ప్రస్తావన తెచ్చారు. అంతేకాదు.. ప్రజలకు పలు సూచనలు, సలహాలు కూడా చేశారు...
వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.
సర్వేలు అన్నీ కేసీఆరే హ్యాట్రిక్ సీఎం అని తేల్చాయని మంత్రి హరీష్‌రావు అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షర్మిలారెడ్డి లేఖ రాశారు. బీఆర్‌ఎస్ నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం బాగుపడాలని తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇవ్వలేదన్నారు.
తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు.
: మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా ఇలా విడుదలైందో లేదో అలా అసంతృప్త నేతలు బయటకొస్తున్నారు. బీజేపీ మూడో జాబితాపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మేయర్ బండా కార్తీకరెడ్డి, ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటర్లు ఎటువైపు ఉన్నారో తెలియక.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారంలో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే..