Share News

YSRTP : ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే ప్రకటన తర్వాత రాహుల్‌కు వైఎస్ షర్మిల సంచలన లేఖ

ABN , First Publish Date - 2023-11-03T15:27:18+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలన ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షర్మిలారెడ్డి లేఖ రాశారు. బీఆర్‌ఎస్ నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

YSRTP : ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే ప్రకటన తర్వాత రాహుల్‌కు వైఎస్ షర్మిల సంచలన లేఖ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిలా రెడ్డి(YSRTP Chief YS Sharmila Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Congress Leader Rahul Gandhi) షర్మిలారెడ్డి లేఖ రాశారు. బీఆర్‌ఎస్ (BRS) నీచపాలన అంతం కోసం ఎటువంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ (CM KCR) అవినీతి రౌడీరాజ్యం అంతమొందించగలిగే కాంగ్రెస్ (Congress) ఓటు చీల్చవద్దనే ఈ త్యాగం అని చెప్పుకొచ్చారు. తెలంగాణ బాగు, భవిత కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party) అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగుతోంది అంటూ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో షర్మిల పేర్కొన్నారు. ఈ లేఖను షర్మిల ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.


కాగా.. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించడం సెన్సేషన్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దానిలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల మళ్లీ ఆయనే సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. దానిలో భాగంగా తనను అనేక మంది మేధావులు సంప్రదించారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీని తాను ఎప్పుడూ వేరుగా చూడలేదన్నారు. కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదని ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామన్న షర్మిల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.


sharmila-letter.jpg

Updated Date - 2023-11-03T15:57:34+05:30 IST