Home » Telangana News
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు.
వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.
జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.
న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ DRT (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) వద్ద లాయర్లు బుధవారం నిరసన తెలిపారు. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి&గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం..
తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు.
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న బాలికను ఓ అగంతకుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.