Share News

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

ABN , Publish Date - Aug 04 , 2024 | 07:14 AM

అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న బాలికను ఓ అగంతకుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

హైదరాబాద్‌: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న బాలికను ఓ అగంతకుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌తో చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


ప్రియాంక అనే మహిళ తన సోదరుడితో కలిసి హైదరాబాద్ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో నివసిస్తోంది. అయితే శనివారం సాయంత్రం తన సోదరుడు కుమార్తె ప్రగతి( 6)తో కలిసి కట్టెలమండిలోని తన తల్లి వద్దకు వచ్చింది. ప్రియాంక సోదరి కుమారుడు హృతిక్‌తో కలిసి బాలిక ఆడుకోవడానికి ఇంటి సమీపంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత హృతిక్ ఒక్కడే ఇంటికి వచ్చాడు. ప్రగతి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను బాలిక మేనత్త ప్రియాంక వెతికారు.


ఎంతసేపటికీ చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఓ అగంతకుడు ఆడుకుంటున్న పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 5బృందాలుగా విడిపోయిన అబిడ్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ప్రగతిని నిందితుడు ఏం చేస్తాడో అని కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్థానికంగా కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది.

Updated Date - Aug 04 , 2024 | 07:14 AM