Home » TG Govt
నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలను సీఎం రేవంత్రెడ్డి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ అయింది.
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ పనులు వడివడిగా సాగుతున్నాయి. 20 అడుగుల ఎత్తైన విగ్రహ నిర్మాణం కోసం రూ.1.16కోట్లను వెచ్చిస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పగించిన కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణ పనుల ఒప్పందాన్ని రేవంత్ సర్కారు రద్దు చేసింది.
సైబర్ నేరాల నిర్మూలనకు హ్యాక్ సమ్మిట్లో నిపుణుల సూచనలు, సలహాలు కీలకంగా మారుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీకి వారి అమూల్యమైన సూచనలు ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024కు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. మంగళవారం (5వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు కులగణన కోసం డెడికేషన్ కమిషన్ (Dedication Commission)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వేంకటేశ్వరరావును నియమించింది.
రాష్ట్రంలో బీసీ జనాభా గణనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల లెక్కలు తీసేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యతపై నిరంతరం నిఘా పెట్టేందుకు ఇకపై జనాభా ప్రాతిపదికన కాకుండా రాష్ట్రంలో హోటళ్ల సంఖ్య ఆధారంగా ఆహార తనిఖీ అధికారుల(ఫుడ్ ఇన్స్పెక్టర్లు)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.