Minister Sridhar Babu: ఆ పని చేసి కోట్ల రూపాయలు వెనక్కి తెప్పించాం: మంత్రి శ్రీధర్ బాబు..
ABN , Publish Date - Nov 06 , 2024 | 02:56 PM
సైబర్ నేరాల నిర్మూలనకు హ్యాక్ సమ్మిట్‌లో నిపుణుల సూచనలు, సలహాలు కీలకంగా మారుతాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సైబర్ సెక్యూరిటీకి వారి అమూల్యమైన సూచనలు ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
హైదరాబాద్: సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్-2024 (హ్యాక్ 2.0)ను జ్యోతి ప్రజ్వలన చేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కోసం చిత్రీకరించిన వీడియోలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. టెక్నాలజీ పెరిగి నేటి సమాజంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయని మంత్రి అన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి జేబులు ఖాళీ చేయాలని కేటుగాళ్లు నిరంతరం కొత్త ఎత్తులు వేస్తున్నారని చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా ప్రజలకు సైబర్ మోసాలపై మరింత అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. హ్యాక్ 2.0 కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు అడివి శేష్ సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. "సైబర్ నేరాల నిర్మూలనకు హ్యాక్ సమ్మిట్‌లో నిపుణుల సూచనలు, సలహాలు కీలకం అవుతాయి. సైబర్ సెక్యూరిటీకి వారి అమూల్యమైన సూచనలు ఎంతో అవసరం. సైబర్ నేరాలు కట్టడి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాం. హైదరాబాద్ రియల్ గ్లోబల్ సైబర్ సిటీగా రూపొందుతోంది. ప్రజా శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోంది.
సైబర్ మోసాలకు గురి కాకుండా తెలంగాణ ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మోసం చేసేందుకు కేటుగాళ్లు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మాటలు చెప్పి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. అపరిచితుల నుంచి వచ్చే ఎటువంటి ఫోన్ కాల్స్, మెయిల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించవద్దు. ఒకవేళ స్పందిస్తే బ్యాంకు ఖాతాల్లోని నగదును ఇట్టే మాయం చేస్తారు. ఈ సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కోట్ల రూపాయలు రికవరీ చేసి బాధితులకు అందజేశాం" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ బైక్ ఎలా నడుస్తోందబ్బా.. పెట్రోల్ లేదు, పెడల్ లేదు.. గాలిలో దూసుకుపోతున్న బైక్..
Hyderabad: గోల్డ్ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..
Read Latest Telangana News And Telugu News