Home » TG Govt
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరి.. మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కావోస్తుంది. ఈ నేపథ్యంలో సంబురాలు నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. అందుకోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం గాంధీ భవన్లో పార్టీ అగ్రనేతలు భేటీ కానున్నారు.
తెలంగాణలోని లగచర్లలోనూ మణిపూర్ వంటి పరిస్థితే ఉందని, అక్కడి గిరిజనుల గోడు దేశమంతా వినాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. తెలంగాణలో గిరిజనులకు న్యాయం దక్కడం లేదని, అందుకే వారి సమస్యను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకొచ్చామని అన్నారు.
ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండుగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ సాఫ్ట్‌వేర్‌పై ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సాంస్కృతిక, కళాప్రదర్శనలతో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి నిర్దేశించిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. కులగణనలో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొని వివరాలు నమోదు చేయించుకున్నారు.
కామన్వెల్త్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ స్టడీ టూర్లో భాగంగా తెలంగాణ శాసన బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హన్, చియాంగ్చాన్ నదులను సందర్శించింది.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న టీ-యాప్ ఫోలియో అప్లికేషన్ పనిచేయకపోవడంతో ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులుగా యాప్ బంద్ కావటంతో లైఫ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయడానికి అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో గ్రూప్-3 పరీక్ష జరగనుంది. సుమారు 5.68 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు 1,401 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 1,365 గ్రూప్-3 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.