Dr. Gummadi Vennela: ‘సాంస్కృతిక సారథి’గా గద్దర్ కుమార్తె
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:12 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సాంస్కృతిక, కళాప్రదర్శనలతో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి నిర్దేశించిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది.
గుమ్మడి వెన్నెలను నియమించిన సర్కారు
హైదరాబాద్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సాంస్కృతిక, కళాప్రదర్శనలతో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి నిర్దేశించిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర యువజన సర్వీసులు సాంస్కృతిక, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా యుద్ధనౌకగా సుప్రసిద్ధుడైన గద్దర్ కుమార్తెను సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమించడం పట్ల పలు తెలంగాణ ప్రజా, సాంస్కృతిక సంఘాలు, కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.