Home » Thanneeru Harish Rao
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరయ్యారు.
మెదక్ అసెంబ్లీ సీటును తక్కువ ఓట్లతో కోల్పోయామని.. ఈ ఓటమి తాత్కాలికమేనని.. శాశ్వతం కాదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harishrao ) అన్నారు. తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
దావొస్‌కు గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) వెళ్తే సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) డబ్బులు దండగ అని విమర్శించారని.. ఇప్పుడు అక్కడకు ఆయన ఎందుకు వెళ్లారని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) ప్రశ్నించారు.
ఢిల్లీలో ఎవరు అధికారంలో ఉన్నా తెలంగాణ గొంతుకను వినిపించేది కేవలం బీఆర్ఎస్(BRS) పార్టీ అని మాజీ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు(HarishRao) అన్నారు. నాగర్ కర్నూల్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి అయ్యాక కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు.
సిద్దిపేట: స్వచ్ సర్వేక్షన్లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేటకు క్లిన్ సిటీ అవార్డ్ రావడానికి కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండగ కూడా కావడంతో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు మున్సిపల్ కార్మికులను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొత్త బట్టలతో సన్మానించారు.
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పై కైట్ ఫెస్టివల్నీ శనివారం నాడు ప్రారంభించారు.
మాజీ సీఎం కేసీఆర్( KCR ) కు పని తనం తప్ప పగతనo తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు.
Telangana: తెలంగాణ భవన్లో పెద్దపల్లి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని అన్నారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారన్నారన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని వెల్లడించారు.
తాను మొన్నటి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ లోపల ఉంటే బీఆర్ఎస్ ( BRS ) నేతలు కేటీఆర్ ( KTR ), హరీష్‌రావు (Harish Rao )ను ఒక ఆట ఆడుకునేవాడినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) సెటైర్లు వేశారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... హరీష్‌రావు, కేటీఆర్‌లకు బస్సు ప్రయాణం తెలియదన్నారు. బెంజ్ కార్లలో తిరిగే బావబమ్మర్ధులకి పేదల సమస్యలు ఏం తెలుసునని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ అక్రమ పాలన చేస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలన చేస్తుందని జగ్గారెడ్డి చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) తెలిపారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలతో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.