Share News

TG Politics: అందుకే అమెరికాకు హరీశ్‌రావు .. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:20 PM

ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు.

TG Politics: అందుకే అమెరికాకు హరీశ్‌రావు .. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister Komati Reddy Venkat Reddy

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో సంచలన విషయాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) బయటపెట్టారు. ఈ కేసు విషయంలో అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో మాజీ మంత్రి హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని ఆరోపించారు. మే 26న ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ Ek 525లో హరీష్‌రావును కేసీఆర్ అమెరికా పంపారని విమర్శించారు. గత సీఎండీ ప్రభాకర్‌కి ఎప్పుడు ఫోన్ చేసినా హాస్పిటల్లో ఉన్నానని చెప్పేవాడన్నారు.అసెంబ్లీకి వచ్చే మొహం కేసీఆర్‌కి లేదన్నారు. అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలవలేదని ప్రమాణం చేయడానికి హరీష్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.


కేసీఆర్‍ని వదిలిపెట్టేది లేదు...

ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్‌రావుకి ఏమోచ్చిందని నిలదీశారు. ఎన్ని రోజులైనా కేసీఆర్‍ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రభాకర్ రావును వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపోవాలని కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కూడా తన తప్పు ఒప్పుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లారని ఆరోపణలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి నివాసంలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.... ప్రభాకర్ రావు ఇండియాకు రాకుండా ఆపేందుకే హరీష్ అమెరికా వెళ్లారన్నారు.


తెలంగాణ జిన్నా.. కేసీఆర్..

ట్యాపింగ్ చేస్తూ భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారని... ప్రభాకర్ రావు అప్రూవర్‌గా మారితే ఇబ్బంది అవుతుందని కేసీఆర్ భయపడుతున్నారన్నారు. కేసీఆర్‍కు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని చెప్పారు. తెలంగాణ జిన్నా లాగా కేసీఆర్ మారారని ఎద్దేవా చేశారు. జిన్నా కూడా ఒకరోజు ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకునే వారని సెటైర్లు గుప్పించారు. కేసీఆర్ కూడా ఒకరోజు ముందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నారని విమర్శించారు. రాక్షస పాలన పోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. మంత్రి పదవి రానందుకే కేసీఆర్ తెలంగాణ వాదం ఎత్తుకున్నారని దెప్పిపొడిచారు.


కేసీఆర్ కోట్ల రూపాయలు వసూలు చేశారు..

ఉద్యమంలో కేసీఆర్ కోట్ల రూపాయలు వసూలు చేశారని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ రాజీనామాలు చేసింది కలెక్షన్ల కోసమేనని విమర్శించారు. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క డీఏస్సీ కూడా ప్రకటించలేదని అన్నారు. జగన్ చేసిన మోసంతో కేసీఆర్ తెలంగాణను ఎండబెట్టారని ఆరోపణలు చేశారు. వరి వేస్తే ఉరే అని రైతులకు చెప్పి కేసీఆర్ మాత్రం వరి వేసుకున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు

Telangana Formation Day: అవి గుర్తుకు వస్తే దుఃఖం వస్తుంది: కేసీఆర్

Telangana State Formation Day: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: కేటీఆర్

For more Telangana News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 03:32 PM