Share News

TG Politics: వాటికి రైతుబంధు ఇవ్వం.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:47 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రేవంత్ ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు (Harish Rao) పనీపాట లేలని.. అందుకే ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

TG Politics: వాటికి రైతుబంధు ఇవ్వం.. కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్
Aadi Srinivas

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రేవంత్ ప్రభుత్వం కొత్త రికార్డు సాధించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావుకు (Harish Rao) పనీపాట లేలని.. అందుకే ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత పార్టీలో ఉనికి కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) విమర్శలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎందుకు ఇలా అయిందోనని హరీష్ తన మామని నిలదీయాలన్నారు. గాయిగాయి చేయడం హరీష్ మానుకోవాలని హితవు పలికారు.


నేడు(సోమవారం) అసెంబ్లీ మీడియా హాల్లో ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రాజీనామా డ్రామా చేశారని విమర్శలు చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్‌కి లేదని చెప్పారు. పనికిమాలిన విషయాలు మానేసి లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన అంశంపై కేటీఆర్, హరీష్ చర్చించుకోవాలన్నారు. పదవి ఉండాలి, ప్రజల్లో సానుభూతి ఉండాలనే హరీష్ ఆరాటపపడుతున్నారని అన్నారు.


తమ ప్రభుత్వంలో 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చామని స్పష్టం చేశారు. తన మామ సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు ఎప్పుడు ఇచ్చారో హరీష్ చెప్పాలని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కొండలు, గుట్టలకు రైతుబంధు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.ఆగస్టు 15వ తేదీన మాజీ ఎమ్మెల్యే కావడానికి హరీష్ మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆది శ్రీనివాస్ సవాల్ విసిరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?

Kishan Reddy: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తా..: కిషన్ రెడ్డి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 10 , 2024 | 04:09 PM