Home » Thummala Nageswara Rao
రైతు రుణమాఫీ ప్రక్రియ మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వా రం పదిరోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేసి, రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలను గుర్తిస్తామని, యాప్ ద్వారా వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పారు. మిగిలిన రూ.18 వేల కోట్ల రుణమాఫీ సొమ్ము తప్పకుండా రైతు ఖాతాల్లో జమచేసి తీరుతామని, ఎవరూ ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు.
Telangana: రైతు రుణమాఫీపై కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు మంగళవారం ధర్నాకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టతనిచ్చారు. ఆపై రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దన్నారు.
రాష్ట్రంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్ గురించి నిద్రలో ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రైతులకు సమయానికి ఎరువులు అందేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
పంట రుణాలు రూ.2లక్షల్లోపు బకాయిలున్న రైతుల్లో.. కుటుంబ నిర్ధారణ జరగని కుటుంబాలు 4,24,873 ఉన్నట్లుగా గుర్తించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేయడంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించిన మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తుమ్మల వెల్లడించారు.
‘అధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గురించి, వారి సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు రైతు రుణమాఫీపైనా, సీఎం రేవంత్‌రెడ్డిపైనా చీప్‌గా విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.
ఆయిల్‌పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
బ్యాంకుల నుంచి వచ్చే సమాచారానికి అనుగుణంగా ప్రతి ఖాతాదారుని అర్హతను బట్టి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.