Home » Thummala Nageswara Rao
వరిసాగులో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
స్వాతం త్య్రం వచ్చాక దేశంలో ధాన్యం ఉత్పత్తి 8 రెట్లు పెరిగి, 14 కోట్ల టన్నులకు చేరుకున్నదని, వడ్ల ఉత్పత్తికి కావాల్సిన అన్ని వనరులు సాంకేతికత రైతుకి అందుబాటులోకొచ్చినా సాగు పరంగా సంక్షోభం ఇవాళ్టికీ పెద్ద సవాలుగానే మిగిలిపోయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో జూన్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు-2024 జరగనుంది.
తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు.. మండల వ్యవసాయ అధికారుల(ఏవోల) బ్లాక్ మార్కెట్ దందాతో ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయి. మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో కొందరు మండల వ్యవసాయ అఽధికారులు.
ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఇవి రెండూ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలని పేర్కొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గాంధీభవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్ యాద వ్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్ మార్చ్, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఆగలేదు.
ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రికి అంతర్జాతీయ పంటల సంస్థ(కాలిఫోర్నియా, అమెరికా) డైరెక్టర్ మెర్సిడెజ్ జోన్స్‌తో పాటు స్థానిక నిర్వహకులు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యలు శుక్రవారం వివరించారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
పత్తి, పచ్చిరొట్ట విత్తనాలకోసం రైతులు ఒకేచోటకు అఽధిక సంఖ్యలో వస్తే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విత్తనాల పంపిణీ సజావుగా జరిగేలా పర్యవేక్షణ చేసే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు.