Tummala: ‘భరోసా’పై దుష్ప్రచారాలను నమ్మొద్దు!
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:01 AM
రైతు భరోసాపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ఇప్పటి వరకు పథకం అమలు పరంగా సీలింగ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
రైతు భరోసా అమలు పరంగా సీలింగ్‌పై, ఐటీ పరిమతి మీద నిర్ణయం తీసుకోలేదు
మంత్రులు తుమ్మల, పొంగులేటి
మహబూబ్‌నగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, ఇప్పటి వరకు పథకం అమలు పరంగా సీలింగ్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో మాట్లాడి, వారి అభిప్రాయాలు సేకరిస్తున్నామని చెప్పారు. వనపర్తి జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయుయంలో శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా రైతు భరోసా వర్క్‌షా్‌పను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు.
గతంలో అమలు చేసిన రైతుబంధు పథకంలో ఎక్కువగా కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పెట్టుబడి సాయం ఇచ్చారని వెల్లడించారు. ఈసారి ఆ తప్పు జరగకుండా.. ఎక్కువ మంది రైతులకు మేలు చేయడంతో పాటు, అనర్హులను ఏరివేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పంటల బీమా పథకంపైనా రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని, ఆకాల వర్షాలు కురిసి పంట నష్టపోతే ఇన్‌పుట్ సబ్సిడీ అందజేస్తామని అన్నారు. మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు. రైతులకు ఇచ్చిన ప్రతిమాటా నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు.
రైతుభరోసా పథకం అమలులో ఆదాయ పన్ను పరిమితి అని, సీలింగ్ అని బీఆర్‌ఎస్ నేతలు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, కానీ అలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. టాక్స్ పేయర్స్, టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేవారు వేర్వేరని తెలిపారు. రైతులకు కచ్చితంగా మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదెకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 90 శాతం పైగా ఉన్నారని, వారందరికీ రైతు భరోసా కల్పిస్తామని చెప్పారు. రైతుల నుంచి కొందరు మాట్లాడుతూ పదెకరాల సీలింగ్ పెట్టాలని, వ్యక్తికి పదెకరాలు కాకుండా కుటుంబానికి పదెకరాలు సీలింగ్ నిర్ణయించాలని తెలిపారు.
ప్రతి పంటకాలంలో సాగుచేసే భూములను మాత్రమే ఏఈవోల ద్వారా గుర్తించి.. ఆ రైతులకు మాత్రమే భరోసా కల్పించాలన్నారు. రైతు రుణమాఫీకి రేషన్‌కార్డు కచ్చితాన్ని తొలగించాలని కోరారు. కౌలు రైతులకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకోవాలంటే పట్టాదారులు కచ్చితంగా ఒప్పుకోరని, దానివల్ల భూమిలో హక్కు అడుగుతారని తెలిపారు. దీనిపై ఎంపీ మల్లు రవి స్పందిస్తూ.. అసెంబ్లీలో కౌలు రైతులు కేవలం సాగు చేసుకోవడానికి మాత్రమే, వారికి భూమిలో హక్కు లభించదనే విషయంపై చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.