Home » Thummala Nageswara Rao
పత్తి, పచ్చిరొట్ట లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్రస్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) గురువారం సమీక్ష నిర్వహించారు. నకిలీవిత్తనాల విక్రయితలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతాంగం కోసం పనిచేశానని చెప్పారు.
ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ సంతోషం వ్యక్తం చేశారు.
అన్ని రకాల వడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతులకు వడ్ల బోనస్ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయడం చూసి బీఆర్ఎస్ ఏడుపు గొట్టు రాజకీయాలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం ఎస్.ఆర్.కన్వెన్షన్లో నియోజక వర్గ సమావేశం నిర్వహించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మార్కెంటింగ్,జౌలి, ఆహార శుద్ధి ఏర్పాట్లు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారన్నారు.
వడగండ్ల వానల కారణంగా యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకు సోమవారం నుంచి నష్టపరిహార ం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒక్క సీట్ కూడా గెలవదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మెజార్టీ పార్లమెంట్ స్థానాలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఈ రాష్ట్రంలో పాలనను చిందరవందరగా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసి, అస్తవ్యస్తం చేసిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.