Home » Thummala Nageswara Rao
సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.2 లక్షలు పైన ఉన్న రైతులకు కూడా రుణమాఫీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రైతులకు మొదటి పంట కాలంలోనే రుణమాఫీ చేశామని అన్నారు. భారతదేశంలో అత్యధికంగా తెలంగాణలో కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారని వెల్లడించారు. సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ పార్టీ రోజురోజుకూ చచ్చిపోతోందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మరో 6 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం నూతన పాలకవర్గాలను నియమించింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి రాష్ట్ర ప్రభుత్వం విశేషాధికారాలు కల్పించింది.
రైతు భరోసాపై కౌలు రైతు, భూ యాజమాని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
పామాయిల్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పంట పండించే రైతులకు ఊరట కలిగిస్తూ.. ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.
ఇక నుంచి పంట వేసిన వారికే రైతుభరోసా(పంట సాయం) ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.