TG News: రైతులకు గుడ్ న్యూస్.. పంట నష్టం నిధులు విడుదల..
ABN , Publish Date - Oct 09 , 2024 | 09:27 PM
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు 79,574 ఎకరాల పంట నష్టానికి గానూ 79,216మంది రైతుల ఖాతాలకు రూ.79.57 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. అన్నదాతల అకౌంట్లలోనే నేరుగా నగదు జమ చేసినట్లు తుమ్మల తెలిపారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో 79,574 ఎకరాలలో పంటనష్టం జరిగినట్లు అధికారులు నిర్ధరించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే నష్టపోయిన రైతన్నలకు పరిహారం అందించినట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 28,407 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. అలాగే మహబూబాబాద్ 14,669 ఎకరాలు, సూర్యాపేటలో 9,828 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. మిగతా 22 జిల్లాల్లో అత్యల్పంగా 19 ఎకరాల నుంచి 3,288 ఎకరాల వరకూ నష్టం ఏర్పడిందని తుమ్మల పేర్కొన్నారు. పంట పరిహారం కింద ఎకరానికి రూ.10 వేల చొప్పున నేరుగా రైతు ఖాతాల్లోనే రూ.79.57కోట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..
TG News: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్..
Group-1 Exam: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే హాల్ టికెట్లు..