Share News

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

ABN , Publish Date - Oct 14 , 2024 | 05:28 AM

వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

వక్క సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతం

  • నిపుణులతో చర్చించి సాగుపై నిర్ణయం:మంత్రి తుమ్మల

  • ఏలూరు జిల్లా కామవరపుకోటలో మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 13 : వక్క పంట సాగుకు తెలంగాణ అనువైన ప్రాంతమని, నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పంట రైతన్నలకు సిరులు కురిపిస్తుందని, తెలంగాణలో సైతం సాగును ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలోని ఏలూరు జిల్లా కామవరపు కోటలో ఆదివారం వాణిజ్య పంట అయిన వక్క సాగును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ పంట సాగు చేస్తున్న రైతులతో సాగు పద్ధతులు, ఆదాయ వ్యయాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో దీని విస్తరణ అవకాశాలపై నిపుణులతో చర్చించారు. వక్క సాగుకు అనుకూల నేలలు, వాతావరణ పరిస్థితులు, నీటి వినియోగం తదితర అంశాలపై నిపుణులతో చర్చించి సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 05:28 AM