Home » Tirumala Laddu
టీటీడీ చైర్మన్ అంటే భక్తులకు విశేషంగా సేవలు అందించాలి. దీనికి తిరుమల, తిరుపతిలోనే ఎక్కువ సమయం గడపాలి.
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.
తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
కేసు పెట్టాలంటే... కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదని.. నెయ్యి ప్యూర్‌గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టేనని.. శిక్ష ఒక్కటే అని వెంకటేష్ అన్నారు. హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటేనని, దేనితో చంపారనే దాన్ని బట్టి శిక్ష ఉండదని.. హత్య హత్యే అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.
తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..
నిజానికి, జగన్ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లోనూ అలజడి మొదలైంది.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.