Share News

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:38 PM

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..
Tirumala Laddu

Tirumala Laddu: తిరుమల లడ్డు వ్యవహారంపై త్వరలో విచారణ జరగనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులను, సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ 5 గురు అధికారులను నియమించారు.

సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఏస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ IG సర్వశ్రేష్ఠ త్రిపాటి, విశాఖ రేంజ్ DIG జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.


లడ్డూ వివాదం..

తిరుమల లడ్డూ అంటే తెలియని వారు ఉండరు. ఎన్నో రకాల ప్రసాదాలున్నప్పటికి భక్తులకు తిరుమల లడ్డూ అంటే ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ లడ్డూ న్యాణతపై గత కొంతకాలంగా విమర్శలు వస్తునే ఉన్నాయి. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతోపాటు అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ఓ లాబ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. దీనిని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్ లోని ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టులో తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేలడంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. అయితే, ఈ సంఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

రంగంలోకి సిట్..

తిరుమల కల్తీ నెయ్యి వివాదం పరిశీలనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రంగంలోకి దిగింది. తిరుపతిలో సిట్ కోసం ప్రత్యేక కార్యలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్‌ని సీబీఐ అధికారులు పరిశీలించారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలోకుడా సిట్ బృందం పరిశీలన చేయనుంది. ఇప్పటికే సిట్ అధికారులు పరిశీలించిన దర్యాప్తు నివేదికని సీబీఐ బృందం పరిశీలించే అవకాశం ఉంది. త్వరలోనే తిరుమలలోని ల్యాబ్, లడ్డు తయారీ పోటుని దర్యాప్తు బృందం పరిశీలించనుంది. టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీని కూడా సీబీఐ బృందం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. విచారణను స్వయంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించనున్నారు..


Also Read:

శభాష్ జగన్.. అబద్ధాల్లో నెంబర్ వన్ అంటూ నెటిజన్ల కితాబు..

మళ్లీ హైడ్రా యాక్షన్ షురూ.. నెక్ట్స్ టార్గెట్ ఆ ఏరియానే..

ప్రముఖ నటుడు మృతి.. విషాదంలో పరిశ్రమ

For More Andhra Pradesh and Telangana News

Updated Date - Nov 08 , 2024 | 09:02 PM