Home » Tirumala Tirupathi
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. వేసవి సెలవులు రావడం, ఎన్నికలు ముగియడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, లేపాక్షి సర్కిల్ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్లుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడబోయే ప్రభుత్వం, ముఖ్యమంత్రితో తెలంగాణ సీఎంగా సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలన్నిటినీ పరిష్కరించుకుని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy in Tirumala: తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని(Lord Venkateswara Swamy) ప్రార్థించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తిరుపతి వెళ్లారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు(మంగళవారం) రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం నుంచి మేఘావృతమైన ఆకాశం.. మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి ఆదివారం దర్శించుకున్నారు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు.