Home » Tirumala Tirupathi
తిరుమలలో మతిస్థిమితం లేని ఒక వ్యక్తి చేయి కోసుకుని వీరంగం సృష్టించాడు.
రేపు శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా.. భక్తులు ఇబ్బందులు పడకుండా గురువారం శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని ..
భక్తి శ్రద్ధలతో భక్తులు తాళ్లతో లాగుతుండగా, మహారథంపై దేవేరులతో కలిసి నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
టోకెన్ విధానంలో సర్వ దర్శనం మూడు నుంచి ఆరు గంటల్లోపు పూర్తవుతుంది. సాధారణంగా చాలామంది భక్తులకు టోకెన్ విధానంపై అవగాహన లేకపోవడంతో నేరుగా తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకుని సర్వ దర్శనం క్యూలైన్లోకి వెళ్లడంతో..
కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?
రివర్స్ టెండరింగ్ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్వస్తి పలికింది. వైసీపీ హయాంలో అమలు చేసిన ఈ విధానం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీటీడీ ఈవో నిర్ణయం తీసుకున్నారు.
తిరుమలలోని అన్నప్రసాద సత్రంలో వడ్డించిన పెరుగన్నంలో జెర్రి కనిపించిందంటూ ఓ భక్తుడు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వరంగల్‌కు చెందిన చందు అనే యువకుడు స్నేహితులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు వచ్చాడు.
తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.
కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..
తిరుమల లడ్డూ తయారీకి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిని వైష్ణవి డెయిరీ నుంచి కొనుగోలు చేసినట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల విచారణలో తేలింది. ఏఆర్ డెయిరీ రెండు డెయిరీల నుంచి నెయ్యిని కొనుగోలు చేసినట్లు ఆధారాలను సేకరించింది. ఈ డెయిరీల దగ్గర కొనుగోలు..