Home » Tirupathi News
నిజం గెలవాలి బహిరంగ సభ ప్రాంగణానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు (సోమవారం) బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుందనుకుంటే.. చాలా తక్కువగా ఉంది.
తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర లాడ్జిలో అన్నాచెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు. మృతులు మహారాష్ట్ర లోని నాందేడ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. అనుమానంతో భార్యను, ఆమె సోదరుడిని భర్త హతమార్చాడని తెలుస్తోంది.
టీటీడీ ప్రకటించిన మనిషికో కర్ర ఒక జోక్‌గా మారిపోయి వైరల్ అయ్యింది. ఒక వేళ సీరియస్‌గా తీసుకున్నా ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీన్ని అమలు చేయాలంటే వేల సంఖ్యలో కర్రలు సేకరించాలి. వాటికోసం అడవి మీద పడాలి. అలిపిరిలో భక్తులకు ఇచ్చే కర్రలను మళ్ళీ తిరుమల దివ్యారామం వద్ద కలెక్ట్ చేసుకోవాలి. వాటిని వాహనాల్లో మళ్ళీ అలిపిరికి తరలించాలి. మధ్యలో భక్తులు కర్రలు పారవేయడం, విరిచేయడం చేస్తే పైకి వెళ్ళేసరికి కర్రల సంఖ్య తగ్గుతుంది.
తిరుపతి పరిసర అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లు విలువైన 51 దుంగలు, ఒకటిన్నర టన్ను ఏ గ్రేడ్ ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 48 మంది నిందితులను అధికారులు అరెస్టు చేశారు. కూంబింగ్‌లో 50 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అలిపిరి మార్గం(Alipiri way)లో పులి దాడి(Tiger attack)లో ఓ చిన్నారి మృతిచెందడంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) విచారం వ్యక్తం చేశారు.‘‘కళ్ల ముందే కన్నబిడ్డ మరణం కన్నవాళ్లకి తీరని శోకం మిగిల్చింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా తిరుపతిలో జనసేన నేతలు వినూత్న నిరసనకు దిగారు. SSS పేరుతో మంత్రి అంబటి రాంబాబుపై సినిమాకు ముహూర్తం షాట్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా నిరోధించే వరకూ ఆమరణ నిరాహారదీక్ష కొన సాగిస్తానని చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జీ పులివర్తి నాని ఆమరణ దీక్షకు దిగారు. అయితే ఆయన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు యత్నించారు. ఆమరణ దీక్ష భగ్నం చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ పక్కన పెట్టుకుని మరీ దీక్షకు పులివర్తి నాని కూర్చున్నారు.
శ్రీనివాస సేతు( Srinivasa Setu) నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. ఫ్లె ఓవర్ రెయిలింగ్‌ను పెట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మూడంతస్తుల భవనం తగలబడిపోతోంది. భవనంలో అనేకమంది వర్కర్లు ఉండే అవకాశం ఉంది. ఫోటో ఫ్రేములు, ఫోటో చిత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.